logo
Published : 30 Jun 2022 05:17 IST

వేడుక ఎంత ‘కళా’త్మకం..!

ఇంతుల దుస్తులపై తంజావూరు చిత్రాలు
న్యూస్‌టుడే,  తెనాలి టౌన్‌

ప్పటికప్పుడు కొత్తదనాన్ని, తాము మరింత అందంగా ముస్తాబయ్యే తీరులో ఆధునిక మార్పులను స్వాగతించే మహిళల ప్రస్తుత ఎంపిక ‘తంజావూరు చిత్రాలు’. అందునా వేడుకను అనుసరించి అందుకు అనుగుణమైన ఆవిష్కరణలను తమ దుస్తులపై ముఖ్యం గా రవికలపై ముద్రింపచేసుకోవడానికి వారు ఇష్టపడుతున్నారు. వివాహ వేడుక అయితే రాధాకృష్ణుని చిత్రాలు, గృహ ప్రవేశాలకు గోవు, ఓణీల వేడుక వంటి సమయంలో వివిధ అలంకరణలు.. ఇలా సందర్భానుసారం ఇవి రూపొందుతున్నాయి. ఈ విభాగంలో ప్రత్యేక ప్రావీ ణ్యం ఉన్న డిజైనర్లు దుస్తులపై ఫ్యాబ్రిక్‌ పెయింట్తో మహిళలు, యువతుల అభిరుచులు, వారి వేడుకలను అనుసరించి వీటిని ఆవిష్కరిస్తున్నారు. పలుమార్లు ఉతికినా చెరిగిపోని విధంగానే ఈ చిత్రా లు ఉంటున్నాయి. వీటి ధరలు చిత్రాన్ని అనుసరించి రూ.1000 నుంచి రూ.3,000 వరకు పలుకుతున్నాయి. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల మహిళలు, యువతులు ఇప్పుడు ఈ థీమ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారని తెనాలికి చెందిన డిజైనర్‌ ‘లక్ష్మీ అలేఖ్య’ చెప్పారు. పెళ్లి కుమార్తెలు మరింత మక్కువ చూపుతున్నారని, చిన్నారుల పుట్టిన రోజులకూ ప్రత్యేక చిత్రాలతో దుస్తులు డిజైన్‌ చేయించుకొంటున్నారని ఆమె వివరించారు. అటు సంప్రదాయం, అటు ఆధునికత జత చేరి రూపొందిన నూతన ఆవిష్కరణలు రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు, చేర్పులతో కొత్త పుంతలు తొక్కుతాయనడంలో సందేహం లేదు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని