logo

ఉద్యమంలా జల సంరక్షణ

దేశంలో జల వనరుల సంరక్షణ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని కేంద్ర జల్‌ శక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి ఆర్తీసింగ్‌ పరిహర్‌ అన్నారు. జిల్లాలో ఆమె బుధవారం పర్యటించారు. గుంటూరుకు

Updated : 30 Jun 2022 07:08 IST

కేంద్ర నోడల్‌ అధికారి ఆర్తీసింగ్‌ పరిహర్‌

సదస్సులో పాల్గొన్న ఆర్తీసింగ్‌ పరిహర్‌. చిత్రంలో శాస్త్రవేత్త అనీషా, డ్వామా ప్రాజెక్టు డైరెక్టరు యుగంధర్‌ కుమార్‌

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: దేశంలో జల వనరుల సంరక్షణ కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని కేంద్ర జల్‌ శక్తి అభియాన్‌ నోడల్‌ అధికారి ఆర్తీసింగ్‌ పరిహర్‌ అన్నారు. జిల్లాలో ఆమె బుధవారం పర్యటించారు. గుంటూరుకు సమీపంలోని లాం కృషి విజ్ఞాన కేంద్రంలో ‘వాన నీటిని సమర్థంగా నిల్వ చేయడం, సమర్థంగా ఉపయోగించుకొనడం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్తీసింగ్‌ మాట్లాడుతూ ప్రతి గృహంలో ఇంకుడు గుంతల నిర్మించుకోవడం ద్వారా వినియోగించిన నీరు భూమిలోకి ఇంకిపోతుందన్నారు. గ్రామాల్లో మహిళలు ముందుకు వచ్చి నీటి వనరుల పెంపు కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నీటి వనరులు నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర భూగర్భ జల వనరుల విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ అనీషా నీటి వనరులను సద్వినియోగం చేసుకునే విధానాల గురించి వివరించారు. కేవీకేలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆర్తీసింగ్‌ పరిహర్‌ వీక్షించారు. సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టరు యుగంధర్‌ కుమార్‌, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త కె.వి.సుబ్రహ్మణ్యం, శాస్త్రవేత్తలు, ఉపాధి పథకం సిబ్బంది, రైతులు, మహిళలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని