logo

18 నుంచి మెమో రైళ్ల పునరుద్ధరణ

కొవిడ్‌ నేపథ్యంలో నిలిపివేసిన మూడు మెమో రైళ్లను జులై 18 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రైలు(07864)

Published : 30 Jun 2022 05:17 IST

గుంటూరు రైల్వే, న్యూస్‌టుడే: కొవిడ్‌ నేపథ్యంలో నిలిపివేసిన మూడు మెమో రైళ్లను జులై 18 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మండల రైల్వే అధికారి తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే రైలు(07864) గుంటూరులో 17.45 గంటలకు బయలుదేరి పెదకాకాని 17.51, నంబూరు 17.57, మంగళగిరి 18.09, కేసీ కెనాల్‌ 18.23, విజయవాడ 19.00 గంటలకు చేరుతుంది. తెనాలి నుంచి గుంటూరు వచ్చే రైలు(07282) తెనాలిలో 15.45 గంటలకు ప్రారంభమై అంగలకుదురు 15.51, సంగంజాగర్లమూడి 15.58, వేజెండ్ల 16.05, గుంటూరు 16.40 గంటలకు వస్తుంది. మార్కాపురం నుంచి తెనాలి వచ్చే రైలు(07890) మార్కాపురంలో 10.10 గంటలకు బయలుదేరి వినుకొండ 11.14, నరసరావుపేట 11.50, గుంటూరు 13.20, తెనాలి 14.45 గంటలకు చేరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని