Raghurama: కేసు నమోదు చేసిన వెంటనే రఘురామను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

కేసుల నమోదులో పోలీసులు చట్టబద్ధ ప్రక్రియ అనుసరించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 4న ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు తనకు

Published : 01 Jul 2022 18:31 IST

అమరావతి: కేసుల నమోదులో పోలీసులు చట్టబద్ధ ప్రక్రియ అనుసరించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 4న ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు తనకు రక్షణ కల్పించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఎంపీగా ఉన్నారు నియోజకవర్గానికి వెళ్ల వచ్చు కదా అని ధర్మాసనం వ్యాఖ్యానించగా... పోలీసులు ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని రఘురామ తరఫున న్యాయవాది ఉమేశ్‌చంద్ర కోర్టుకు తెలిపారు. ఈనెల 3, 4 తేదీల్లో కేసు పెడితే పోలీసులు చట్టబద్ధ ప్రక్రియ అనుసరించాలన్న హైకోర్టు ... కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేసేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని