logo

శోభాయమానంగా జగన్నాథ రథయాత్ర

ఇస్కాన్‌ గుంటూరు ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర శుక్రవారం నగర ప్రధాన వీధుల్లో భక్తిప్రపూరిత వాతావరణంలో సాగింది. ఇస్కాన్‌ నుంచి మొదలై ప్రధాన ప్రాంతాల మీదుగా 

Published : 02 Jul 2022 06:29 IST

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ఇస్కాన్‌ గుంటూరు ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర శుక్రవారం నగర ప్రధాన వీధుల్లో భక్తిప్రపూరిత వాతావరణంలో సాగింది. ఇస్కాన్‌ నుంచి మొదలై ప్రధాన ప్రాంతాల మీదుగా  వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వరకు యాత్ర  సాగింది. యాత్ర అగ్రభాగాన మంగళవాద్యాలు, కోలాట నృత్యాలు, దేవీ దేవతా వేషధారణలు సందడి చేశాయి. విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర భాజపా ధార్మిక సెల్‌ కన్వీనర్‌ సత్య గోపినాథ్‌ మాట్లాడారు.  గుంటూరు కమిటీ సభ్యుడు పుండరీ గోవింద్‌ ప్రభు, ఇస్కాన్‌ ఆలయం సమన్వయకర్తలు చైతన్య ప్రకాష్‌, వీర గోవింద్‌, రాష్ట్ర భాజపా యువమోర్చా పదాధికారి కొక్కెర శ్రీనివాస్‌ యాదవ్‌, రథ యాత్ర కమిటీ సభ్యులు పూర్ణచంద్రరావు, శేషగిరి గుప్త, వెంకట వాసుదేవాప్రభు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత జగన్నాథ, బలదేవ్‌ రథయాత్ర పురస్కరించుకొని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు పూర్తి సంప్రదాయ పద్ధతిలో రథయాత్ర సాగే రహదారిని బంగారు చీపురుతో శుభ్రం చేసి లాంఛనంగా రథయాత్రను ప్రారంభించారు. సత్య గోపీనాథ్‌, రామ్‌ మురారిదాస్‌, గోవింద్‌దాస్‌, అరుణ్‌కుమార్‌, రామ్‌ప్రసాద్‌,  పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని