logo

మత్స్య సాగుదారులకు నోటీసులు

గుంటూరు నగర శివారు ఓబులనాయుడుపాలెం గ్రామం సమీపంలో ప్రభుత్వభూమిలో చేపల చెరువులు సాగుచేస్తున్నవారు తక్షణమే ఖాళీ చేయాలని మత్స్యశాఖ నోటీసులు ఇచ్చింది. శనివారం ఈనాడులో ‘నా భూమి... నా ఇష్టం’ శీర్షికన కథనం ప్రచురితమైంది.

Published : 03 Jul 2022 06:26 IST

ఈనాడు-అమరావతి: గుంటూరు నగర శివారు ఓబులనాయుడుపాలెం గ్రామం సమీపంలో ప్రభుత్వభూమిలో చేపల చెరువులు సాగుచేస్తున్నవారు తక్షణమే ఖాళీ చేయాలని మత్స్యశాఖ నోటీసులు ఇచ్చింది. శనివారం ఈనాడులో ‘నా భూమి... నా ఇష్టం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన మత్స్యశాఖ క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించి ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపలసాగు చేస్తున్నట్లు గుర్తించింది. సొంత భూములు లేదా లీజుకు తీసుకున్న పట్టాభూముల్లో సాగుచేసే వాటికే మత్స్యశాఖ అనుమతులు ఇస్తుంది. ప్రభుత్వభూమిలో సాగుచేస్తున్నందున అనుమతులు ఇవ్వడానికి అర్హత లేదని వెంటనే ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొంది. తక్షణమే సాగుచేస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో స్పష్టం చేశారు. పొత్తూరు గ్రామానికి చెందిన పుట్టా బాజీ, కట్టవరపు మాధవరావుకు గుంటూరు జిల్లా మత్స్యశాఖ అధికారి వీవీఆర్‌ బాబు నోటీసులు ఇచ్చారు. ఇదే సమాచారాన్ని గుంటూరు పశ్చిమ తహశీల్దారుకు పంపి చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని