logo

విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు

జిల్లాలో విద్యుత్తు సమస్యలు వివరిస్తూ ‘కాటేస్తున్నా.. కళ్లు తెరవరా?’ శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన కథనానికి సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. ప్రమాదాల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గణపవరం శివారు రొయ్యల చెరువుల

Published : 03 Jul 2022 06:26 IST

బాపట్ల అర్బన్‌, న్యూస్‌టుడే : జిల్లాలో విద్యుత్తు సమస్యలు వివరిస్తూ ‘కాటేస్తున్నా.. కళ్లు తెరవరా?’ శీర్షికతో ఈనాడులో ప్రచురితమైన కథనానికి సంబంధిత శాఖ అధికారులు స్పందించారు. ప్రమాదాల నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గణపవరం శివారు రొయ్యల చెరువుల వద్ద చేతికందే ఎత్తులో ఉన్న విద్యుత్తు తీగలను ఏఈ కోటేశ్వరరావుతో కలిసి ఈఈ ఆంజనేయులు శనివారం పరిశీలించారు. త్వరితగతిన రెండు విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసి లైను ఎత్తు పెంచాలని ఏఈని ఆదేశించారు. బాపట్లలోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్తు స్తంభాన్ని పరిశీలించిన అధికారులు అక్కడ నిర్మించిన ప్రహరీ విషయాన్ని మున్సిపల్‌ కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈఈ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండలాల్లో శిథిలావస్థలో ఉన్న విద్యుత్తు స్తంభాలు మార్చాలని, ఇతర సమస్యలు సత్వరమే పరిష్కరించాలని ఏఈలను ఆదేశించామన్నారు. విద్యుత్తు లైన్ల కింద ఎవరూ ఇళ్లు నిర్మించుకోవద్దని వినియోగదారులకు ఆయన సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని