logo

విద్యార్థులకు సమాజంపై అవగాహన అవసరం

పాఠశాల విద్యార్థుల్లో సమాజంపై అవగాహన పెరిగేలా విద్యాబోధన ఉండాలని కలెక్టర్‌ శివశంకర్‌ అన్నారు. స్పందనహాల్‌లో శనివారం సాయంత్రం వార్షిక విద్యా ప్రణాళికపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు.

Published : 03 Jul 2022 06:26 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ శివశంకర్‌

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: పాఠశాల విద్యార్థుల్లో సమాజంపై అవగాహన పెరిగేలా విద్యాబోధన ఉండాలని కలెక్టర్‌ శివశంకర్‌ అన్నారు. స్పందనహాల్‌లో శనివారం సాయంత్రం వార్షిక విద్యా ప్రణాళికపై ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భవిష్యత్తులో విద్యార్థులను సమాజానికి మేలు చేసే ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాల విద్యార్థులకు వెన్నెల కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. అందులో ప్రతి నెలా సంస్కృతి సంప్రదాయాలు, క్రీడలు, పర్యాటక ప్రదేశాల సందర్శన, మేధోసంపత్తి, భవిత, యోచన తదితర అంశాలు విద్యాబోధనలో ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. గతంలో తాను తయారు చేసిన విద్యాప్రణాళిక తరహాలోనే నూతన ప్రణాళిక ఉండాలని సూచించారు. ఉపాధ్యాయుల ఆలోచనలను జోడించి విజ్ఞానం పెంచడమే లక్ష్యంగా విద్యాప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని