logo
Published : 03 Jul 2022 06:26 IST

ఎట్టకేలకు బదిలీ ఉత్తర్వులు

గుంటూరు, న్యూస్‌టుడే: జిల్లాలో పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా కొనసాగింది. గడువు ముగిసిన రెండు రోజులకు ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాపరిషత్‌ పరిధిలోని జడ్పీ, మండల పరిషత్తు కార్యాలయాలు, ఉన్నత పాఠశాలలు, ఇంజినీరింగ్‌ కార్యాలయాల్లోని జూనియర్‌, సీనియర్‌ సహాయకులు, పరిపాలన అధికారుల వరకు బదిలీలను చేపట్టారు. ఉదయం వరకు జాబితాలో ఉన్న ఉద్యోగుల పేర్లు తొలగించి నూతనంగా కొందరివి చేర్చారు. జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా, సీఈవో శ్రీనివాసరెడ్డి, జడ్పీ ‘ఎ’ విభాగం పరిపాలన అధికారి, సిబ్బందితో సుదీర్ఘంగా చర్చించారు. ఆయా క్యాడర్లకు చెందిన ఉద్యోగుల్లో ఐదు సంవత్సరాలు పైన పనిచేస్తున్న వారిలో ఎక్కువ మందిని బదిలీ చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులను కూడా బదిలీ చేశారు. జిల్లాపరిషత్తు కార్యాలయంలో విభాగాల పరిపాలన అధికారుల స్థానాల కోసం ఉద్యోగులు చివరి వరకు గట్టి ప్రయత్నాలు చేశారు. ప్రజాప్రతినిధులతో ఫోన్లు చేయించారు. కొందరి ప్రయత్నాలు ఫలించాయి.  శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎట్టకేలకు ఉద్యోగులకు బదిలీ ఉత్తర్వులను అందజేశారు. జూన్‌ 30వ తేదీతో ఉత్తర్వులు ఇచ్చారు. రాత్రి 7 గంటల తర్వాత ఆఫీస్‌ సబార్డినేట్లకు సంబంధించి బదిలీ దరఖాస్తులను పరిశీలన చేపట్టారు. సుమారు 450 దరఖాస్తులు పరిశీలించాల్సి ఉండటంతో ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. శుక్ర, శనివారాలు జడ్పీ సిబ్బంది బయోమెట్రిక్‌ హాజరు వేయలేదు. హాజరు పుస్తకంలోనూ సంతకాలు చేయలేదు. సాంకేతికంగా ఇబ్బందులు ఎదురు కానుండటంతో హాజరు వేయలేదు. బదిలీ అయిన వారు క్యాజువల్‌ లీవ్‌ పెట్టుకోవాల్సి ఉంటుందని ఉద్యోగులు పేర్కొన్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని