logo

వీధి శునకాల దాడిలో పెంపుడు కుక్క మృతి

కుక్కల సమస్య వివాదానికి దారితీసింది. గుంటూరు ఏటి అగ్రహారం 11వ లైను ఇందుకు వేదికైంది. ఇక్కడ శనివారం వీధి శునకాల దాడిలో 20 నెలల పెంపుడు కుక్క పిల్ల మృతి చెందింది. వీధి కుక్కలు ఇంట్లోకి వచ్చి మరీ పెంపుడు కుక్కపై దాడి చేశాయి.

Published : 03 Jul 2022 06:34 IST

యజమాని, బ్లూక్రాస్‌ ప్రతినిధుల మధ్య వాగ్వాదం
కార్పొరేటర్‌, పోలీసులు చొరవతో సద్దుమణిగిన వివాదం


రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన పెంపుడు కుక్క యజమాని శివారెడ్డి

ఏ.టి.అగ్రహారం, న్యూస్‌టుడే: కుక్కల సమస్య వివాదానికి దారితీసింది. గుంటూరు ఏటి అగ్రహారం 11వ లైను ఇందుకు వేదికైంది. ఇక్కడ శనివారం వీధి శునకాల దాడిలో 20 నెలల పెంపుడు కుక్క పిల్ల మృతి చెందింది. వీధి కుక్కలు ఇంట్లోకి వచ్చి మరీ పెంపుడు కుక్కపై దాడి చేశాయి. దాని పక్కనే ఉన్న చిన్న పాప భయభ్రాంతులకు గురై కింద పడిపోయింది. దీంతో పెంపుడు కుక్క యజమాని శివారెడ్డి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వీధి కుక్కలతో దాదాపు సంవత్సరం నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామని, అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆయనతోపాటు స్థానికులు మండిపడ్డారు. అధికారులు స్పందించే వరకు ఆందోళన చేస్తామన్నారు. సమస్యను స్థానిక కార్పొరేటర్‌ అచ్చాల వెంకటరెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, వెంటనే ఆయన కార్పొరేషన్‌ అధికారులతో మాట్లాడి కుక్కలను తీసుకు వెళ్లే వాహనాన్ని పిలిపించారు. అయితే వీధి కుక్కలను పెంచేవారు,  బ్లుక్రాస్‌ ప్రతినిధులు కుక్కలను పట్టికెళ్లడానికి ఒప్పుకోలేదు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు, కార్పొరేటర్‌ అచ్చాల వెంకటరెడ్డి వీధి కుక్కలను పోషించే వ్యక్తికి సర్ది చెప్పారు. కుక్కలను మున్సిపల్‌ వాహనంలోకి ఎక్కించి తీసుకు వెళ్లేలా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని