Chandrababu: సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: చంద్రబాబు

సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు.

Published : 03 Jul 2022 13:51 IST

అమరావతి: సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులను తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. సోషల్‌ మీడియా పోస్టుల విషయంలో తెదేపా శ్రేణులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. 

గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకొని సీఐడీ వేధించిందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. నోటీసుల పేరుతో అర్ధరాత్రి తలుపులు పగులగొట్టి పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. సుప్రీం తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలను ప్రభుత్వం రాజకీయ వేధింపులకు గురిచేస్తోందని.. కుట్ర చేసిన సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని