logo

Andhra News: ట్రెండీ బిచ్చగాడు.. మోపెడ్‌పై మైక్‌తో..

బాబూధర్మం, అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ వినూత్న రీతిలో తెనాలికి చెందిన గోపిరెడ్డి యాచించడం చూసినవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంగళగిరి అంబేడ్కర్‌బొమ్మ కూడలిలో మంగళవారం ఉదయం

Updated : 06 Jul 2022 12:43 IST

మంగళగిరి(తాడేపల్లి), న్యూస్‌టుడే: బాబూధర్మం, అయ్యా ధర్మం, అమ్మా ధర్మం అంటూ వినూత్న రీతిలో తెనాలికి చెందిన గోపిరెడ్డి యాచించడం చూసినవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మంగళగిరి అంబేడ్కర్‌ బొమ్మ కూడలిలో మంగళవారం ఉదయం టీవీఎస్‌ మోపెడ్‌పై మైక్‌ ఏర్పాటు చేసుకుని రికార్డు ద్వారా ధర్మం చేయమంటూ యాచిస్తూ కనిపించాడు. చూసిన వారు రోజులు మారాయి.. ధర్మం చేయమని నోటితో అడిగే కాలం చెల్లింది అంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. నంద్యాల అడవుల్లో వైద్యానికి సంబంధించి మూలికల కోసం వెళ్లినప్పుడు కాలిలో ముళ్లు దిగాయి. అదికాస్తా సెప్టిక్‌ కావడంతో మోకాలి వరకు పుండ్లు పడి నడవలేని పరిస్థితి వల్ల యాచిస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని