logo

అమ్మ రాదని.. అన్నం పెట్టలేదని..

వారిది పేద కుటుంబం. కష్టపడి పనులు చేసుకుంటూ భార్యాభర్త జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు దివ్యాంగులు. ఇద్దరికీ మంచమే ప్రపంచం. కాలు కింద పెట్టలేని పరిస్థితి. అలాంటి వారికి ఆ తల్లి  సేవలు చేస్తూ.. మరో ప్రపంచాన్ని చూపిస్తోంది. నోరు తెరచి ఆకలి అని

Published : 10 Aug 2022 04:19 IST

కారు ఢీకొని వివాహిత మృతి

దివ్యాంగ కుమారుల పరిస్థితి దయనీయం

వారిది పేద కుటుంబం. కష్టపడి పనులు చేసుకుంటూ భార్యాభర్త జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు దివ్యాంగులు. ఇద్దరికీ మంచమే ప్రపంచం. కాలు కింద పెట్టలేని పరిస్థితి. అలాంటి వారికి ఆ తల్లి  సేవలు చేస్తూ.. మరో ప్రపంచాన్ని చూపిస్తోంది. నోరు తెరచి ఆకలి అని అడగలేని దైన్యం. అలాంటి అమ్మ బయటకు వెళ్లి రహదారి ప్రమాదంలో మృత్యువాత పడింది. చీకటి పడినా.. ఇంకా తల్లి ఇంటికి రాలేదే.. అన్నం పెట్టలేదే అని  ఎదురు చూస్తున్నారు. అమ్మ ఇక రాదని.. శాశ్వతంగా దూరం అయిందని వారికి బంధువులు సైతం చెప్పలేని స్థితి.  

యడ్లపాడు, న్యూస్‌టుడే : రోడ్డు మార్జిన్‌లో నిలుచున్న ఓ మహిళను కారు ఢీకొనటంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు... మండలంలోని తిమ్మాపురం ఎస్సీకాలనీకి చెందిన కాకి మరియమ్మ (38) గృహిణి. ఆమె భర్త ప్రకాష్‌ సమీపంలోని నూలుమిల్లులో డ్రైవర్‌. మరియమ్మ మంగళవారం ఉదయం పాలు, కూరగాయలు కొని ఇంటికి వచ్చే క్రమంలో జాతీయ రహదారి మార్జిన్‌లో నిరీక్షిస్తోంది. ఇంతలో గుంటూరు వైపు వెళుతున్న కారు రోడ్డు పక్కన నిలుచున్న ఆమెను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. రహదారి విభాగినిని ఢీకొనటంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. మృతురాలికి ఇద్దరు దివ్యాంగులైన పిల్లలు ఉన్నారు. వీరికి తల్లే ఆధారం. మంచం దిగలేని వీరికి అన్నీ తానై మరియమ్మ చూసేది. ఇపుడు ఆమె మృతితో పిల్లల ఆదరణ ప్రశ్నార్థకమైంది. మృతురాలి భర్త ప్రకాష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని