logo

‘ఎస్సీ, ఎస్టీలపై ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలి’

దళితుల హక్కులను, నిధులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు ఏసుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్లలోని ఓ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో

Published : 10 Aug 2022 04:19 IST

గోరంట్ల, న్యూస్‌టుడే: దళితుల హక్కులను, నిధులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు ఏసుబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోరంట్లలోని ఓ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఎస్సీ, ఎస్టీ మహిళలకు 45 సంవత్సరాలు దాటితే పెన్షన్‌ అన్నారని, గెలిచిన తర్వాత 45 సంవత్సరాలు దాటిన రజకులకు, కుమ్మర్లు, గౌడలకు, సేనాపతులకు, కాపు మహిళలకు భరోసా ఇస్తున్నారని, జెండా పట్టుకు తిరిగి ఓట్లు వేసిన దళితులకు ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్సీ నిధులు రూ.1271 కోట్లు దారి మళ్లించారని, ఎస్సీ కార్పొరేషన్‌ నిర్వీర్యం, ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రద్దు, దేవాదాయ, ధర్మాదాయ శాఖలో హిందువులే ఉద్యోగాలు చేయాలనే జీవోలు, దళిత నాయకులపై తప్పుడు కేసులు వంటి వాటి వల్ల దళితులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రిజర్వ్‌ నియోజకవర్గంలోనూ అగ్రవర్ణాలకి పెత్తనం ఇస్తున్నారన్నారు. ఇటువంటి విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని