logo

కృష్ణమ్మ ఉగ్రరూపం

కృష్ణా నదిలో వరద ఉగ్ర రూపం దాల్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారం ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారులను మరింత అప్రమత్తం చేశారు.

Updated : 13 Aug 2022 05:46 IST


కృష్ణా నదికి వరదనీరు పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీరు

తాడేపల్లి, న్యూస్‌టుడే : కృష్ణా నదిలో వరద ఉగ్ర రూపం దాల్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారం ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారులను మరింత అప్రమత్తం చేశారు. ఉదయం 8.30 గంటలకు 40 గేట్లను పూర్తిగా, 30 గేట్లను 8 అడుగుల మేర ఎత్తారు. 9.30 గంటలకు ఎగువ నుంచి 4,10,393 క్యూసెక్కులు రాగా, 70 గేట్లను పూర్తిగా ఎత్తి వేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసే నీటిని శుక్రవారం 3.60 లక్షల క్యూసెక్కులకు తగ్గించారు. కాల్వలకు 13,963 క్యూసెక్కులు విడుదల చేశారు.


వరద దిగువన నీటి మునిగిన నివాసాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని