logo

బస్సు ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి

కళాశాల బస్సు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం నంబూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంబూరుకు చెందిన షేక్‌ సుభాని(49) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు.

Published : 13 Aug 2022 06:19 IST


రోడ్డుపై భైఠాయించిన ముస్లిం మహిళలు

నంబూరు(పెదకాకాని): కళాశాల బస్సు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన శుక్రవారం నంబూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నంబూరుకు చెందిన షేక్‌ సుభాని(49) భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నారు. రోజు లాగే పనికి వెళ్లిన ఈయన మధ్యాహ్నం జెండా చెట్టుకు వెళ్లే మలుపు దగ్గర స్నేహితుడి ద్విచక్ర వాహనం దిగి ఇంటికి వెళ్తున్నారు.  ఓ ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన బస్సు అతివేగంతో మలుపు తిరుగుతూ ఆయన్ను ఢీకొట్టింది. కిందపడిపోయిన ఆయన తలపై నుంచి బస్సు వెళ్లిపోవడంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన భార్య అనారోగ్య కారణంగా విజయవాడలోని కుమార్తె వద్దకు వెళ్లారు.  
న్యాయం చేయాలంటూ నిరసన: కళాశాల బస్సు ఢీకొని మృతిచెందిన సుభాని కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ నంబూరు-దుగ్గిరాల రోడ్డుపై భైఠాయించి పలువురు ముస్లిం మహిళలు నిరసన తెలిపారు. మృతదేహం ఉన్న ప్రదేశంలో వారు టెంటు వేసి కూర్చున్నారు. పోలీసులు వారితో చర్చలు జరిపి, నిరసనను విరమింపచేశారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని