logo

చిత్ర వార్తలు

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి, నగరపాలక సంస్థ సంయుక్తంగా శుక్రవారం మంగళగిరిలో వివిధ కళాశాలలు,...

Published : 13 Aug 2022 06:25 IST

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి, నగరపాలక సంస్థ సంయుక్తంగా శుక్రవారం మంగళగిరిలో వివిధ కళాశాలలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులతో కలిసి నిర్వహించిన భారీ ప్రదర్శన.

-న్యూస్‌టుడే, మంగళగిరి (తాడేపల్లి)


వరములీయవమ్మా.. అంకమ్మ

శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మార్టూరు మండలం ద్రోణాదులో అంకమ్మ దేవతను గాజులతో ప్రత్యేక అలంకరించారు.

- న్యూస్‌టుడే, మార్టూరు


త్రివర్ణ హారం

పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలెంలో శుక్రవారం జాతీయ జెండా రెపరెపలాడింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు క్రీడా ప్రాంగణంలో 75 అడుగుల జాతీయ జెండాతో మానవహారం నిర్వహించారు.

- న్యూస్‌టుడే, పిట్టలవానిపాలెం


వ్యవసాయ క్షేత్రం.. త్రివర్ణ శోభితం

చిలకలూరిపేట మండలం కావూరు లింగంగుంట్ల వద్ద ఓ రైతు ప్రకృతి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేస్తున్నాడు. అక్కడ పెంచే మొక్కలకు ఏర్పాటు చేసిన షేడ్‌ నెట్‌కు జాతీయ పతాకంతో కూడిన నెట్‌ ఏర్పాటు చేశాడు. రైతు గుడిపల్లి నాగభూషణం మాట్లాడుతూ అమృత్‌మహోత్సవాలు పురస్కరించుకుని మువ్వెన్నల పతాకాన్ని అమర్చినట్లు తెలిపాడు.

-న్యూస్‌టుడే, నరసరావుపేట


దేశభక్తి చాటారిలా..

అమృత్‌మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా యడ్లపాడు మండలం లింగారావుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో భారతదేశ చిత్రపటం ఆకారంలో విద్యార్థులు కూర్చున్నారు.

- న్యూస్‌టుడే, యడ్లపాడు


పంటకోసం తంటా..

కృష్ణమ్మ పరవళ్లు అన్నదాతల్లో కలవరాన్ని నింపింది. ముందస్తుగా వరద సమాచారం అందుకున్న రైతులు శుక్రవారం అప్రమత్తమయ్యారు. పంటనష్టాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టారు. ప్రాణాలకు తెగించి చేతికందిన పంటను కాపాడునేందుకు వారు ప్రయత్నించారు. వరద నీటిలోనే దొండ, కాకర, సొర, వంగ తదితర కాయకూరలను కోసి, మార్కెట్‌కు తరలిస్తున్నారు. ముంపులోనే మొక్కజొన్న (కండెలు) కోతలు చేపట్టారు. కట్టకింద పల్లపు ప్రాంతాల్లో సాగుచేసిన కంద, అరటి, పసుపు, నిమ్మ తదితర పంటతోటల్లోకి వరదనీరు చేరుతోంది.

- కొల్లిపర, న్యూస్‌టుడే

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts