logo

దేశభక్తికి ప్రతీక... జాతీయ పతాక

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పైలాన్‌, 100 అడుగుల ఎత్తున భారీ జాతీయ పతాక ఆవిష్కరణ దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని అన్నారు. ఆజాదీ కా అమృత్‌మహోత్సవాల్లో భాగంగా నరసరావుపేటలో

Published : 15 Aug 2022 06:39 IST

నరసరావుపేటలో 100 అడుగుల ఎత్తున జాతీయ పతాక రెపరెపలు


నరసరావుపేటలో సిద్ధమైన సభా వేదిక

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పైలాన్‌, 100 అడుగుల ఎత్తున భారీ జాతీయ పతాక ఆవిష్కరణ దేశభక్తికి ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖా మంత్రి విడదల రజిని అన్నారు. ఆజాదీ కా అమృత్‌మహోత్సవాల్లో భాగంగా నరసరావుపేటలో గుంటూరు క్రాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పైలాన్‌, 100 అడుగుల స్తంభంపై జాతీయ పతాకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. మంత్రి రజిని ఆజాదీ పార్కును ముందుగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 15 అడుగుల ఎత్తు, 22 వెడల్పు ఉన్న జాతీయ పతాకాన్ని కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం జెండా వందనం చేశారు. పార్కు అభివృద్ధి, పైలాన్‌ ఏర్పాటు, జాతీయపతాకం ఏర్పాటుకు సహకరించిన దాతలు డాక్టర్‌ కారసాని శ్రీనివాసరెడ్డి, భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాతాని వెంకటేశ్వర్లు, పొన్నపాటి విజయకృష్ణారెడ్డి, పాతూరి శ్రీనివాసరావు, ఆర్‌.రామచంద్రారెడ్డిని మంత్రి సత్కరించారు. మంత్రి రజిని, కలెక్టర్‌, ఎస్పీలు మొక్కలు నాటారు.

స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన

రొంపిచర్ల, న్యూస్‌టుడే: నరసరావుపేట డీఎస్‌ఏ స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల ఏర్పాట్లను కలెక్టర్‌ శివశంకర్‌ లోతేటి ఆదివారం పరిశీలించారు. సభావేదిక, వేడుకల ప్రాంగణంలో పల్నాడు జిల్లా వైభవం చాటి చెప్పేలా స్వాతంత్య్ర సమర యోధుల చిత్ర పదర్శన, పర్యాటక ప్రదేశాలు, చరిత్ర, మహనీయుల గత గుర్తులు,  ప్రభుత్వ పథకాల ప్రదర్శనలు ఉండాలని సూచించారు. పలు శాఖల స్టాళ్లు, శకటాలు ప్రదర్శన వంటివి అత్యంత రమణీయంగా ఉండాలన్నారు. పోలీసుల గౌరవ వందనం తదితర కార్యక్రమాలతోపాటు అవార్డుల పంపిణీపై అధికారులతో చర్చించారు. సోమవారం ఉదయం 9 గంటలకు జరిగే వేడుకలకు ముఖ్యఅతిథిగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కారుమూరు వెంకట నాగేశ్వరరావు హాజరవుతున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.  

రిమోట్‌ కంట్రోల్‌ సాయంతో పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి రజిని, ఎమ్మెల్యే గోపిరెడ్డి, కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి తదితరులు


త్రివర్ణ శోభ

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం వినుకొండ పట్టణంలో 800 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహిస్తున్న స్థానిక గీతాంజలి పాఠశాల విద్యార్థులు  - న్యూస్‌టుడే, వినుకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని