logo

494 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 494 మిడ్‌-లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. ఒప్పంద విధానంలో

Published : 15 Aug 2022 06:39 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే : ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకుల కార్యాలయ పరిధిలోని ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 494 మిడ్‌-లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేశారు. ఒప్పంద విధానంలో జరిగే ఈ నియామకాలకు బీఎస్సీ(నర్సింగ్‌)డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో రాతపరీక్ష నిర్వహించనున్నారు. మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆరు నెలల కమ్యూనిటీ హెల్త్‌ సర్టిఫికెట్‌ కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసిన వారికి నేరుగా నియామక పత్రాలను అందజేస్తారు. ఆ అర్హత లేనివారు ఇగ్నో ద్వారా ఆరునెలల సర్టిఫికెట్‌ కోర్సులో శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆగస్టు 24 నుంచి 30వ తేదీ వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సెప్టెంబరు మొదటివారలో రాతపరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు hmfw.ap.gov.in, cfw.ap.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని