logo

సూక్ష్మం.. దేశభక్తి అనంతం

పట్టణానికి చెందిన స్వర్ణకారుడు, యూనియన్‌ బ్యాంక్‌లో గోల్డ్‌ అప్రయిజర్‌గా పనిచేస్తున్న నక్కా వెంకటేష్‌ పలు సూక్ష్మ నమూనాలను తయారుచేసి ఔరా అనిపించుకుంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా

Published : 15 Aug 2022 06:39 IST

చీరాల పట్టణం, న్యూస్‌టుడే: పట్టణానికి చెందిన స్వర్ణకారుడు, యూనియన్‌ బ్యాంక్‌లో గోల్డ్‌ అప్రయిజర్‌గా పనిచేస్తున్న నక్కా వెంకటేష్‌ పలు సూక్ష్మ నమూనాలను తయారుచేసి ఔరా అనిపించుకుంటున్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన వెండి, బంగారాన్ని ఉపయోగించి సూక్ష్మ విజయస్తూపాన్ని రూపొందించి తన దేశభక్తిని చాటుకున్నారు. వెండి - 6.400 గ్రాములు, బంగారం - 0.400 మిల్లీ గ్రాములను ఉపయోగించి 7సెంటీమీటర్ల పొడవుగల విజయ స్తూపాన్ని రూపొందించారు. దీని తయారీకి మూడు రోజుల సమయం పట్టిందని వెంకటేష్‌ చెప్పారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో భాగంగా చీరాల కూరగాయల మార్కెట్‌ వద్ద ఆదివారం ప్రారంభించిన స్వాతంత్య్ర సమరయోధుల విజయస్తూపాన్ని ఇది పోలి ఉండడం విశేషం.


ఎగురుమా.. మా భారతీయ జెండా

మేమెల్లరం మహనీయుల ఆశయాలకు అనుగుణంగా బాపూజీ, చాచాజీ, శాస్త్రీజీ, పటేల్‌, తిలక్‌, భగత్‌సింగ్‌, అల్లూరి, రుద్రమ్మ, సరోజినీ దుర్గాబాయి, ప్రకాశం పంతులు తదితర స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలే వమ్ముకాని రీతిగా సత్య, ధర్మ, న్యాయాలే మరింతగా సాఫల్యమొందగా ఎగురుమా ఎగురుమా జాతీయ జెండా మా మువ్వన్నెల జెండా దేశభక్తి సేవయే మా దేవతార్చన రీతిగా పరమత సహనమే మా నిత్యాభరణంగా నిరుపమాన సౌజన్యం మా నికేతనమై అలరంగా కరువు కాటకాలే ఇక కనరాక మాదేశమే సుభిక్షమనంగా ఎగురుమా ఎగురుమా మా భారతీయ జెండా

- గాడేపల్లి మల్లికార్జునుడు, ఆంధ్ర భాషాపండితుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని