logo

తమ్ముడి గొంతుకోసి హతమార్చిన అన్న?

రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని గొంతుకోసి హతమార్చిన అన్న మృతదేహాన్ని ఇంటిదగ్గరే పూడ్చిపెట్టిన సంఘటన మండలంలో సంచలనం రేపింది. మార్టూరు మండలం ద్రోణాదులలో ఆదివారం రాత్రి ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

Published : 15 Aug 2022 06:39 IST

ద్రోణాదుల (మార్టూరు) న్యూస్‌టుడే: రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిని గొంతుకోసి హతమార్చిన అన్న మృతదేహాన్ని ఇంటిదగ్గరే పూడ్చిపెట్టిన సంఘటన మండలంలో సంచలనం రేపింది. మార్టూరు మండలం ద్రోణాదులలో ఆదివారం రాత్రి ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామ శివారున బొబ్బేపల్లి రహదారి పక్కన అన్నదమ్ములు నాగులూరి చెన్నకేశవులు, నాగులూరి గాంధీ (27) నివాసాలు ఉన్నాయి. వీరు దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవారు. వీరి ప్రవర్తనతో విసిగి వీరి భార్యలు దూరంగా ఉంటున్నారు. ఆదివారం ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. మద్యం మత్తులో ఉన్న ఆవేశానికి గురైన చెన్నకేశవులు కొడవలితో తమ్ముడు గాంధీ గొంతుకోసి హత్య చేశాడని, మృతదేహాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టినట్లు తెలిపాడని గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ విషయమై సమాచారం అందుకున్న మార్టూరు, యద్దనపూడి ఎస్సైలు రవీంద్రారెడ్డి రత్నకుమారి సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. అప్పటికే చీకటి పడింది. దీంతో మృతదేహం పూడ్చినట్లు భావిస్తున్న ప్రాంతంలో సోమవారం ఉదయం తవ్వకాలు చేసి పరిశీలించి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.  


వివాహితపై అత్యాచారయత్నం

పర్చూరు, న్యూస్‌టుడే: వివాహితపై అత్యాచారయత్నం చేశాడనే ఆరోపణలతో యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీభవాని తెలిపారు. పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన మహిళ (24) ఈనెల 9న ఇంట్లో నిద్రిస్తుండగా రవి అనే యువకుడు తలుపులు తీసి వచ్చి తనపై అత్యాచారయత్నం చేసినట్లు బాధితురాలు ఆదివారం ఫిర్యాదు చేసింది. ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పానని వారు స్పందించక పోవడంతో అవమానభారంతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చినట్లు వివరించారు. దేవరపల్లిలో వారం వ్యవధిలో అత్యాచారయత్నం ఘటన ఇది రెండోది కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని