logo

అసమానతలు రూపు మాపేందుకు కృషి చేయాలి

దేశాన్ని ఒకప్పుడు విదేశీయులు పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుని పాలన చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం సాధించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో

Published : 15 Aug 2022 06:39 IST

మాట్లాడుతున్న జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే : దేశాన్ని ఒకప్పుడు విదేశీయులు పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుని పాలన చేస్తే ప్రజలు తిరుగుబాటు చేసి స్వాతంత్య్రం సాధించారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. ఆదివారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమవేశం నిర్వహించారు. భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా కుల, మత భేదాలు, సాంఘిక అసమానతలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని రూపు మాపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్రిటీష్‌ కాలం నాటి దుర్మార్గ పాలన పునరావృతమైందని ఆరోపించారు. బ్రిటీష్‌ పాలకుల మాదిరిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని గృహాల్లో నిర్బంధించటం, కేసులు పెట్టి వేధించటం లాంటి పనులు చేస్తున్నారన్నారు. చివరకు రాజధాని కోసం పోరాడిన మహిళలపై కూడా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపారని విమర్శించారు. సోమవారం గుంటూరులో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకలకు వర్షం కురిసినా ఇబ్బంది పడకుండా వీక్షించేందుకు గొడుగులు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, జిల్లా ప్రచార కార్యదర్శి ఓంకార్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని