Andhra News: స్వాతంత్ర్య దినోత్సవ వేళ.. 175 మంది ఖైదీల విడుదల

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది ఖైదీలను

Published : 15 Aug 2022 17:11 IST

అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్ర్పవర్తన కలిగిన ఖైదీలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది ఖైదీలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 48 మంది జీవిత ఖైదు పడిన వారుసైతం ఉన్నారు. విడుదలైన మొత్తం ఖైదీల్లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి 66 మంది విడుదలయ్యారు. వారిలో 55 మంది పురుషులు, 11 మంది మహిళలున్నారు. విశాఖ కేంద్ర కారాగారం నుంచి 40 మందిని విడుదల చేశారు. వీరిలో 33 మంది జీవిత ఖైదు, ఏడుగురు ఇతర శిక్షలు పడిన వారు ఉన్నారు. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి 25 మంది ఖైదీలకు ప్రభుత్వం విముక్తి కలిగించింది. బయటకు వెళ్లిన తర్వాత ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా ఉపశమనాన్ని రద్దు చేస్తామని పోలీసులు ఖైదీలను హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని