logo

ప్రగతిలో జిల్లాది ప్రత్యేక స్థానం

దేశ స్వాతంత్రోద్యమంలో గుంటూరు జిల్లా ప్రముఖ పాత్ర పోషించి ప్రత్యేక స్థానం సంపాదించిందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం పోలీసు కవాతు మైదానంలో 76వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు.

Published : 16 Aug 2022 07:11 IST

ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు
ఘనంగా స్వాతంత్య్ర వజ్రోత్సవం

జెండా వందనం  చేస్తున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, చిత్రంలో జిల్లా అధికారులు

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే : దేశ స్వాతంత్రోద్యమంలో గుంటూరు జిల్లా ప్రముఖ పాత్ర పోషించి ప్రత్యేక స్థానం సంపాదించిందని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. సోమవారం పోలీసు కవాతు మైదానంలో 76వ స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు జిల్లా కేంద్రాన్ని చేరువ చేసేందుకు పార్లమెంటు నియోజకవర్గ ప్రాతిపదికన జిల్లాల పునర్విభజన చేసినట్లు తెలిపారు. జిల్లాలో 262 గ్రామ సచివాలయాలు, 306 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి 5,033 సిబ్బందిని, 11 వేల మంది వాలంటీర్లను నియమించి 334 సేవలు ఒకేచోట అందిస్తున్నట్లు తెలిపారు. రైతుభరోసా పథకం ద్వారా లక్షా 12 వేల మంది రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ. 7,500 చొప్పన రూ. 84.63 కోట్లు వారి ఖాతాలో జమ చేశామన్నారు. జలయజ్ఞంలో భాగంగా గుంటూరు ఛానల్‌ ఆధునికీకరణ పనులకు రూ. 652.78 కోట్లు మంజూరు చేశామన్నారు. వైద్యశాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 196 మంది వైద్యులు, 653 ఇతర సిబ్బందిని నియామకం చేసినట్లు వివరించారు. ఆరోగ్యశ్రీ ద్వారా 2019 నుంచి 2022 జులై వరకు రూ. 369.36 కోట్లతో 1.49 లక్షల మంది రోగులకు శస్త్ర చికిత్స అందించినట్లు తెలిపారు. వివిధ పథకాల అమలు తీరును మంత్రి వివరించారు. జిల్లాలో రూ. 471.37 కోట్లతో 346 కి.మీ మేర 57 రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులు చేపట్టామన్నారు. రూ. 10.80 కోట్లతో 24 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నిర్మాణం చేపట్టామన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో అమృత్‌ పథకం కింద రూ. 33.53 కోట్లతో తాగునీటి పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని