logo

కృష్ణా వరద తగ్గుదల

కృష్ణా నది దిగువున వరద సోమవారం క్రమేపీ తగ్గుదలలో ఉంది. ప్రకాశం బ్యారేజీకి ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 2,99,582 క్యూసెక్కుల వరద నీరు రాగా, బ్యారేజీ వద్ద 40 గేట్లను ఏడు అడుగులు, మిగతా 30 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తారు.

Published : 16 Aug 2022 07:11 IST

ఎన్టీఆర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : కృష్ణా నది దిగువున వరద సోమవారం క్రమేపీ తగ్గుదలలో ఉంది. ప్రకాశం బ్యారేజీకి ఉదయం 6 గంటలకు ఎగువ నుంచి 2,99,582 క్యూసెక్కుల వరద నీరు రాగా, బ్యారేజీ వద్ద 40 గేట్లను ఏడు అడుగులు, మిగతా 30 గేట్లను ఆరు అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2,85,550 క్యూసెక్కులు, పంట కాల్వలకు 14,032 క్యూసెక్కులు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు 2,95,432 క్యూసెక్కులకు తగ్గడంతో 35 గేట్లను 7 అడుగులు, మిగతా 35 గేట్లను 6 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2,81,400 క్యూసెక్కులు విడుదల చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు 2,92,574 క్యూసెక్కులకు తగ్గింది. 25 గేట్లను 7 అడుగులు, మిగతా 45 గేట్లను 6 అడుగుల మేర ఎత్తారు. సముద్రంలోకి 2,77,825 క్యూసెక్కులు విడుదల చేశారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు