logo

హర్‌ ఘర్‌ తిరంగా విజయవంతం

ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం విజయవంతమైంది. గుజ్జనగుండ్ల కూడలి సమీపంలో చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్‌లో

Published : 16 Aug 2022 07:11 IST

దేశానికి నేను ఏమి ఇచ్చాననే భావన రావాలి 

 స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబునాయుడు

గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో జరగిన స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తున్న చంద్రబాబు

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం విజయవంతమైంది. గుజ్జనగుండ్ల కూడలి సమీపంలో చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్‌లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు సోమవారం జరిగాయి. ముఖ్య అతిథిగా తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హాజరయ్యారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత విభజిత గుంటూరు జిల్లాలో తొలిసారి జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో చంద్రబాబు పాల్గొనడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. స్థానిక ప్రజలు కూడా రావడంతో సీట్లు నిండిపోయాయి. కళాకారులు నృత్యాలు ప్రదర్శించారు.  చంద్రబాబు ఉదయం 9.49 గంటలకు ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనను ఎన్‌సీసీ క్యాడెట్లు మార్చ్‌ఫాస్ట్‌ చేస్తూ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం సభా వేదిక ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని చంద్రబాబు ఎగురవేసి సెల్యూట్‌ చేశారు. . ‘దేశం నాకు ఏమి ఇచ్చింది అనేది కాకుండా దేశానికి నేను ఏమి చేశాను..’ అనే భావనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలన్నారు. దేశభక్తి కలిగి ఉండటంతో పాటు జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలన్నారు. విలువలతో కూడిన సమాజంతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మొదట స్వాతంత్య్ర సమరయోధుడు కన్నెగంటి సీతారామయ్య, జయలక్ష్మి దంపతులను చంద్రబాబు సన్మానించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇది పార్టీ సమావేశం కానందున ఎలాంటి నినాదాలు చేయవద్దని కోరినా కార్యకర్తలు పట్టించుకోకపోవడం గమనార్హం.

* సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, పార్టీ జిల్లా పరిశీలకులు డోలా బాల వీరాంజనేయస్వామి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, మాజీ మంత్రి, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీలు టి.డి.జనార్దన్‌, మంతెన సత్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, పల్నాడు జిల్లా తెదేపా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు మొహమ్మద్‌ నసీర్‌, కోవెలమూడి రవీంద్ర, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకరరావు, తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, ప్రచార కమిటీ కార్యదర్శి చిట్టాబత్తిన చిట్టిబాబు, కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరాంప్రసాద్‌, మానం పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు.
కిడ్డీ బ్యాంకు డబ్బులు అందజేత.. కొమ్మినేని సాంబశివరావు కుమారుడు శుభహరి (7వ తరగతి), కుమార్తె పూజ్యశ్రీ (4వ తరగతి)  కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బులతో సైకిల్‌ కొనుక్కోవాలని భావించారు. ఆగస్టు 15వ తేదీన శుభహరి పుట్టిన రోజు కావడంతో చంద్రబాబుకు కిడ్డీ బ్యాంకులోని రూ.10 వేలను చంద్రబాబుకు అందజేశారు. ప్రజలకు ఉపయోగించాలని కోరారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని