logo

రోడ్డు తవ్వుతున్నారంటూ రైతుల ఆందోళన

మండలంలోని వడ్డమాను నుంచి అమరావతి వెళ్లే మార్గంలో రోడ్డును తవ్వి మట్టి తరలించుకు పోతున్నారని సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. గ్రామ శివారులో శివాలయానికి చెందిన దేవదాయ భూమి ఉంది

Published : 16 Aug 2022 07:11 IST


వడ్డమాను గ్రామ శివారులో దేవాదాయ భూమికి ఆనుకొని రోడ్డు పక్కన మట్టి తవ్విన ప్రాంతం

గుంటూరు, న్యూస్‌టుడే: మండలంలోని వడ్డమాను నుంచి అమరావతి వెళ్లే మార్గంలో రోడ్డును తవ్వి మట్టి తరలించుకు పోతున్నారని సోమవారం రైతులు ఆందోళనకు దిగారు. గ్రామ శివారులో శివాలయానికి చెందిన దేవదాయ భూమి ఉంది. అక్కడ దానికి ఆనుకొని రోడ్డు పక్కన జేసీబీతో లోతుగా మట్టిని తవ్వి గ్రామానికి చెందిన కొంత మంది ట్రాక్టర్లతో తరలించారు. ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం అక్కడికి చేరుకొని ఆందోళనకు దిగారు. తుళ్లూరు పోలీసులు మట్టి తవ్విన ప్రాంతానికి వచ్చారు. పోలీసులు రావడంతో మట్టి తరలిస్తున్న వాహనాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. రోడ్డు పక్కన లోతైన గుంట తవ్వి మట్టిని పక్కన నిర్మాణంలో ఉన్న పశువుల ఫారానికి తరలిస్తున్నారని, దారి పాడవటంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చేపట్టారు. మట్టి తవ్వకాలు చేసిన వాహనాలను స్టేషన్‌కు తీసుకువెళ్లి కేసులు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్‌ చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని