logo

సురేష్‌బాబుకు కేంద్ర హోం శాఖ పతకం

నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై 2020లో రూ. 5 కోట్ల విలువైన కంటైనర్‌ అపహరణకు గురైంది. ఘటనకు కారణమైన కంచరభట్ల గ్యాంగ్‌ను పట్టుకున్నందుకుగాను గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసుస్టేషన్‌ సీఐ బండారు సురేష్‌బాబును కేంద్ర హోంశాఖ పతకానికి

Published : 16 Aug 2022 07:11 IST

మంత్రి ధర్మాన ప్రసాదరావు నుంచి కేంద్ర హోం శాఖ పతకం, పురస్కారం స్వీకరిస్తున్న సీఐ సురేష్‌బాబు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై 2020లో రూ. 5 కోట్ల విలువైన కంటైనర్‌ అపహరణకు గురైంది. ఘటనకు కారణమైన కంచరభట్ల గ్యాంగ్‌ను పట్టుకున్నందుకుగాను గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసుస్టేషన్‌ సీఐ బండారు సురేష్‌బాబును కేంద్ర హోంశాఖ పతకానికి ఎంపిక చేసింది. 2022లో ఉగాదికి ప్రభుత్వం సేవా పతకానికి ఎంపిక చేసింది. ఈ రెండు పతకాలు సోమవారం పోలీసు కవాతు మైదానంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ చేతుల మీదుగా సీఐ స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని