logo

ప్రగతి పథంలో గుంటూరు రైల్వే డివిజన్‌

గుంటూరు రైల్వే డివిజన్‌ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడుస్తుందని మండల రైల్వే అధికారి మోహన్‌రాజా తెలిపారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైల్‌విహార్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో

Published : 16 Aug 2022 07:11 IST

గుంటూరు రైల్వే: గుంటూరు రైల్వే డివిజన్‌ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడుస్తుందని మండల రైల్వే అధికారి మోహన్‌రాజా తెలిపారు. 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రైల్‌విహార్‌లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మోహన్‌రాజా మాట్లాడుతూ ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గుర్తింపుగా ద.మ.రైల్వే పరిధిలో నాలుగు షీల్డ్‌లను సాధించామన్నారు. గుంటూరు-గుంతకల్‌ మార్గం డబ్లింగ్‌, విద్యుదీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. అంతకుముందు రైల్వే రక్షక దళం(ఆర్‌పీఎఫ్‌) ఉద్యోగుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని