logo

దేశానికి ఏం చేశాననే భావన ముఖ్యం

ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం విజయవంతమైంది. గుజ్జనగుండ్ల కూడలి సమీపంలో చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్‌లో

Published : 16 Aug 2022 07:11 IST

స్వాతంత్య్ర  వేడుకల్లో చంద్రబాబు నాయుడు
గుంటూరులో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ విజయవంతం

చంద్రబాబు ప్రసంగం వింటున్న వేడుకకు హాజరైన జనం

గుంటూరు, న్యూస్‌టుడే: ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం విజయవంతమైంది. గుజ్జనగుండ్ల కూడలి సమీపంలో చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్‌లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు సోమవారం జరిగాయి. ముఖ్య అతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు ఉదయం 9.49 గంటలకు చేబ్రోలు హనుమయ్య ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయనను ఎన్‌సీసీ క్యాడెట్లు మార్చ్‌ఫాస్ట్‌ చేస్తూ వేదిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం సభా వేదిక ముందు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని చంద్రబాబు ఎగురవేసి సెల్యూట్‌ చేశారు. తర్వాత చంద్రబాబు స్వాతంత్య్ర దినోత్సవం గురించి ప్రసంగించారు. ‘దేశం నాకు ఏమి ఇచ్చింది అనేది కాకుండా దేశానికి నేను ఏమి చేశాను..’ అనే భావనను ప్రతిఒక్కరూ కలిగి ఉండాలన్నారు. దేశభక్తి కలిగి ఉండటంతో పాటు జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలన్నారు. విలువలతో కూడిన సమాజంతోనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరైన చంద్రబాబు సభా వేదిక వద్దకు చేరుకున్నప్పుడు కార్యకర్తలు ‘జై బాబు.. జైజై బాబు.. సీఎం బాబు..’ అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఇది పార్టీ సమావేశం కానందున ఎలాంటి నినాదాలు చేయవద్దని కోరారు. సమావేశంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, పార్టీ జిల్లా పరిశీలకుడు డోలా బాల వీరాంజనేయస్వామి, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీలు టి.డి.జనార్దన్‌, మంతెన సత్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు, పల్నాడు జిల్లా తెదేపా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని