logo

సాగర్‌ జలాశయానికి పెరిగిన వరద

నాగార్జునసాగర్‌ జలాశయానికి శ్రీశైలం జలాశయం నుంచి 4,37,896 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ జలాశయం 26 క్రస్టుగేట్ల ద్వారా 3,31,406 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణాకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ కుడి కాలువకు 8642,

Published : 17 Aug 2022 05:48 IST

26 రేడియల్‌ క్రస్టుగేట్ల నుంచి దుముకుతున్న వరద నీరు

విజయపురిసౌత్‌, న్యూస్‌టుడే: నాగార్జునసాగర్‌ జలాశయానికి శ్రీశైలం జలాశయం నుంచి 4,37,896 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ జలాశయం 26 క్రస్టుగేట్ల ద్వారా 3,31,406 క్యూసెక్కుల నీటిని దిగువ కృష్ణాకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ కుడి కాలువకు 8642, ఎడమ కాలువకు 8541, సాగర్‌ ప్రధాన జలవిద్యుత్తు కేంద్రానికి 33,008, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు 1800, లోలెవల్‌ కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం 3,83,697 క్యూసెక్కుల నీకు దిగువకు వెళ్తోంది. శ్రీశైలం నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది. ఇది 210.9936 టీఎంసీలకు సమానంగా ఉంది. జూరాల, రోజాల నుంచి శ్రీశైలం జలాశయానికి 3,35,635 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ నీటిమట్టం 586.20 అడుగులకు చేరింది. ఇది 301.3570 టీఎంసీలకు సమానం. కృష్ణా ఎగువ పరివాహక ప్రాంతమైన కర్ణాటక, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా దిగువ జలాశయాలైన ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, రోజా, నాగార్జునసాగర్‌ డ్యాంలు గరిష్ఠ స్థాయికి చేరువయ్యాయి. ఎగువ నుంచి వచ్చిన వరద నీటిని దిగువకు వదులుతున్నారు.  

టెయిల్‌పాండ్‌లో 17 గేట్ల ఎత్తివేత

రెంటచింతల, న్యూస్‌టుడే : ఎగువనున్న నాగార్జునసాగర్‌ నదీ పరివాహక ప్రాంతం నుంచి సత్రశాల టెయిల్‌పాండ్‌ రిజర్వాయరుకు మంగళవారం 3,64,414 క్యూసెక్కుల కృష్ణా జలాలు వచ్చి చేరుతున్నట్లు జెన్‌కో ఏఈ నరసింహారావు తెలిపారు. టెయిల్‌పాండ్‌లో 16 రేడియల్‌ గేట్లు 4.5 మీటర్లు, ఒక్క గేటు 2.5 మీటర్లు ఎత్తి దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు 3,67,565 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయరు సాధారణ నీటిమట్టం 75 మీటర్లుకాగా ప్రస్తుతం 73.003 మీటర్ల ఎత్తులో నీరు నిల్వ చేరింది. ఇది 5.507 టీఎంసీలకు సమానం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని