logo

సంజీవని ఆరోగ్య కేంద్రం ప్రారంభం

నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవ చేయాలనే లక్ష్యంతో సంజీవని వైద్య రథాలతో పాటు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ తెలిపారు. మంగళగిరి టిప్పర్లబజారులో తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని

Published : 17 Aug 2022 05:58 IST

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్న లోకేశ్‌

మంగళగిరి (తాడేపల్లి), న్యూస్‌టుడే: నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవ చేయాలనే లక్ష్యంతో సంజీవని వైద్య రథాలతో పాటు ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్‌ తెలిపారు. మంగళగిరి టిప్పర్లబజారులో తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘నిరుపేద కుటుంబాలు వైద్యఖర్చుల భారం మోయలేక కుంగిపోతున్నాయి. వారందరినీ ఆదుకునేందుకు దుగ్గిరాల మండలంలో సంజీవని పేరుతో ఆరోగ్య రథాన్ని ఏర్పాటు చేశాం. అన్ని గ్రామాల్లో తిరగాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మంగళగిరి పట్టణ, గ్రామీణ మండల ప్రజల కోసం ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశాం. ఈ నెలలో తాడేపల్లిలోనూ కూడా ఆరోగ్య కేంద్రాన్ని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేయనున్నట్లు’ చెప్పారు. ‘ఆరోగ్య రథం ప్రారంభించిన తరువాత 300 మందికి ఉచితంగా వైద్యాన్ని తెదేపా అందించింది. మందులు ఇచ్చాం, వైద్యం చేయించామనే బాధ్యత అయిపోయిందనుకోకుండా మంగళగిరి ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ ఎలా ఇంప్రూవ్‌ చేయాలో ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. దుగ్గిరాలలో పరిశీలిస్తే ఆస్త్మా ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నారుల్లో కూడా ఇలాగే ఉంది. ఈ వివరాలను సేకరించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చించి, రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలిస్తా’నన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఏ పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చేయదని, అది తెదేపా మాత్రమే చేస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని