logo

సైబర్‌ నేరాల టోల్‌ఫ్రీ నంబరు 1930

ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సైబర్‌ నేరం జరిగినట్లు గుర్తించిన వెంటనే ప్రజలు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబరు 1930కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో

Published : 17 Aug 2022 06:05 IST

సిబ్బందితో మాట్లాడుతున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బాపట్ల, న్యూస్‌టుడే : ఆర్థిక లావాదేవీలకు సంబంధించి సైబర్‌ నేరం జరిగినట్లు గుర్తించిన వెంటనే ప్రజలు టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ నంబరు 1930కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో సైబర్‌ నేరాల దర్యాప్తుపై పోలీసు అధికారులు జూమ్‌ సమావేశం ద్వారా అవగాహన కల్పించారు. సైబర్‌ నేరం జరిగి రూ.15 వేల కన్నా ఎక్కువ నగదు నష్టపోతే 48 గంటల్లో టోల్‌ఫ్రీ నంబరు 1930కి ఫోన్‌చేసి, ఏపీ సీఐడీ శాఖకు వివరాలు తెలియజేస్తే నిందితుడి బ్యాంకు ఖాతాలోని నగదు ఫ్రీజ్‌ చేస్తారన్నారు. పోలీసు అధికారులు సైబర్‌ నేరాలు, ఐటీ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడే నిందితులకు కఠిన శిక్ష పడేలా కేసుల దర్యాప్తు చేపట్టాలని పేర్కొన్నారు. డీసీఆర్‌బీ డీఎస్పీ లక్ష్మయ్య, డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ మురళీకృష్ణ, ఐటీ కోర్‌ అధికారి భారత్‌ పాల్గొన్నారు.

పారదర్శకంగా పోస్టింగ్‌లు : పరస్పర బదిలీపై జిల్లాకు వచ్చిన 13 మంది ఏఎస్సైలు, పోలీసు కానిస్టేబుళ్లకు పారదర్శకంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కౌన్సిలింగ్‌లో ఎస్పీ మాట్లాడుతూ.. అనుభవం ఆధారంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేశామన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని