logo

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం: ఎస్పీ

గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. యద్దనపూడి స్టేషన్‌ వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.

Published : 18 Aug 2022 05:49 IST


యద్దనపూడి స్టేషన్‌ వద్ద 104 ఏళ్ల వృద్ధురాలిని సత్కరించి, ఆశీర్వచనాలు అదుకుంటున్న ఎస్పీ జిందాల్‌

యద్దనపూడి, న్యూస్‌టుడే: గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేదిలేదని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు. యద్దనపూడి స్టేషన్‌ వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. సచివాలయ మహిళా పోలీసులు తమ పరిధిలోని గ్రామాలపై పూర్తి అవగాహనతో మెలగాలని సూచించారు. గ్రామాల్లో రౌడీలు, పాతనేరస్తుల నేరచరిత్ర, ప్రస్తుత జీవన విధానాలను గమనించాలని చెప్పారు. వ్యక్తుల అదృశ్యం, చిన్నపిల్లలు, మహిళల పట్ల జరిగే నేరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలపాలన్నారు. గ్రామాల్లో పోలీసులు క్రమం తప్పకుండా పర్యటిస్తూ అక్కడి సమస్యలను పరిష్కరించి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలన్నారు. ఈసందర్భంగా స్టేషన్‌లోని దస్త్రాలను పరిశీలించి, పాతకేసుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రాత్రివేళల్లో పోలీస్‌ గస్తీ పెంచాలని చెప్పారు. నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే స్థలాల వద్ద తీసుకోవల్సిన జాగ్రత్తలను వెంటనే చేపట్టాలని కోరారు. ఈసందర్భంగా యనమదలకు చెందిన 104 ఏళ్ల వృద్ధురాలు కొణిదెన మహాలక్ష్మమ్మ యోగక్షేమాలను తెలుసుకుని, సత్కరించారు. ఆమె ఆశీర్వచనాలు పొందారు. ఆయన వెంట బాపట్ల డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, మార్టూరు సీఐ ఐ.ఆంజనేయరెడ్డి, ఎస్సై డి.రత్నకుమారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని