logo

ఎవరెవరి ఖాతాల్లో ఎంత జమచేశారు?

పంచాయతీ నిధుల వినియోగంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి రమేష్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం కారంచేడు పంచాయతీ నిధులు....

Published : 18 Aug 2022 05:49 IST


కారంచేడులో పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ చేస్తున్న డీపీవో రమేష్‌

కారంచేడు, న్యూస్‌టుడే: పంచాయతీ నిధుల వినియోగంలో నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి రమేష్‌ స్పష్టం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు బుధవారం కారంచేడు పంచాయతీ నిధులు రూ.75.89 లక్షలు దుర్వినియోగం ఆరోపణలపై స్థానిక పంచాయతీ కార్యాలయంలో విచారణ జరిపారు. నిధులను ఎవరెవరి ఖాతాల్లో ఎంత జమచేశారనే దానిపై వివరాలు తీసుకున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గతంలో పనిచేసిన కార్యదర్శి బ్రహ్మయ్య, ప్రత్యేకాధికారి శివనాగప్రసాద్‌, మండల పరిషత్‌ కార్యాలయ సహాయకురాలు విమల, బిల్‌ కలెక్టర్‌ గోపిరాజు, చెరువు కాపలాదారు కరీముల్లా, స్వీపర్‌ ఎం.శ్రీనివాసరావు నుంచి లిఖిత పూర్వక వివరణలు తీసుకున్నారు. శానిటరీ మేస్త్రి విచారణకు హాజరు కాలేదు. సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేస్తానని డీపీవో రమేష్‌ తెలిపారు. అదేవిధంగా పంచాయతీకి చెందిన చెరువు కౌలు ఆదాయం రూ.3 లక్షలు ఎందుకు జమచేయలేదని గతంలో పనిచేసిన కార్యదర్శి బ్రహ్మయ్యను డీపీవో ప్రశ్నించారు. గుమస్తా వసూలు చేశారని, తనకు అప్పగించలేదని చెప్పినట్లు తెలిసింది. నిధులను ఇష్టం వచ్చినట్లు ఎలా వినియోగిస్తారని ప్రశ్నించినట్లు సమాచారు. విచారణలో డీఎల్పీవో వెంకట్రావు, సర్పంచి బాలిగ శివపార్వతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని