logo

ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేందుకే ముఖ ఆధారిత హాజరు నమోదు

రాష్ట్రంలో టెట్‌ నిర్వహణ పూర్తికాగానే డీఎస్సీ ప్రకటన జారీ చేసి ఖాళీగా ఉన్న 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Published : 18 Aug 2022 05:49 IST


జన విజ్ఞాన వేదిక గోడప్రతులు ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు తదితరులు

నారాయణపురం (దాచేపల్లి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో టెట్‌ నిర్వహణ పూర్తికాగానే డీఎస్సీ ప్రకటన జారీ చేసి ఖాళీగా ఉన్న 25 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దాచేపల్లి మండలం నారాయణపురం బంగ్లాలో బుధవారం ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లాలో 10,200 మంది ఉపాధ్యాయులకు 7,445 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేందుకే ముఖ ఆధారిత హాజరు విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఉపాధ్యాయుల అవస్థలు దృష్టిలో ఉంచుకుని నూతన విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరారు. ఉపాధ్యాయ పోస్టుల కుదింపు కోసం జారీ చేసిన జీవో 117ను రద్దు చేయాలన్నారు. పాఠశాలల విలీనం ప్రక్రియ నిలిపివేయాలని కోరారు. అనంతరం జన విజ్ఞాన వేదిక గోడప్రతులు ఆవిష్కరించారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి వట్టెపు నాగేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని