logo

చిత్ర వార్తలు

రాజధాని నిర్మాణాలు జరుగుతున్న రోజుల్లో నిత్యం భారీ  వాహనాల రాకపోకలతో సందడిగా ఉండే రహదారి ఇది. నిర్మాణ సామగ్రి తరలింపు, భారీ క్రేన్‌లు రావడానికి వీలుగా ఉండేది.

Published : 18 Aug 2022 06:04 IST

నాడు ఘనం... నేడు దీనం

రాజధాని నిర్మాణాలు జరుగుతున్న రోజుల్లో నిత్యం భారీ  వాహనాల రాకపోకలతో సందడిగా ఉండే రహదారి ఇది. నిర్మాణ సామగ్రి తరలింపు, భారీ క్రేన్‌లు రావడానికి వీలుగా ఉండేది. మూడేళ్లుగా నిర్మాణ పనులు జరగకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగిపోయి కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లడానికి వీలులేనంతగా మారిపోయి కుంగిపోయాయి. వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా ఇక్కడ నిర్మాణ పనులు చేయడానికి వచ్చే కార్మికుల రాకపోకలతో సందడిగా ఉండేది. ఇప్పుడు మనుషుల జాడ కూడా లేనంతగా తయారయ్యింది.

- ఈనాడు అమరావతి


శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ప్రారంభం

శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీల ప్రభుపాదుల వారి 126వ శ్రీ వ్యాస పూజ మహోత్సవాలు నరసరావుపేట పట్టణంలోని బరంపేట శ్రీశ్రీ రాధా గోవింద చంద్ర మందిరంలో బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాధాకృష్ణులను ప్రత్యేకంగా అలంకరించారు.

-న్యూస్‌టుడే, మల్లమ్మ సెంటర్‌


బొప్పాయి..  భలే ఉందోయి

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురవాయపాలెం గ్రామ రైతు చుండ్రు  గురుస్వామికి చెందిన బొప్పాయి తోటలో బొప్పాయ కాయలు స్టార్‌ ఫిష్‌, శంఖు, బాతు తదితర ఆకారాల్లో ఉండి చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

-న్యూస్‌టుడే, నరసరావుపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని