logo

ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్యాయత్నం

వ్యాపారం, ఇతర కారణాలతో చేసిన అప్పులు భారంగా మారడం, ప్రతి నెలా వాటి వడ్డీలు, చీటీపాటల మొత్తాలు కట్టలేక పోవడం.. వెరసి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం....

Published : 18 Aug 2022 05:52 IST

ఆర్థిక ఇబ్బందులే కారణం

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: వ్యాపారం, ఇతర కారణాలతో చేసిన అప్పులు భారంగా మారడం, ప్రతి నెలా వాటి వడ్డీలు, చీటీపాటల మొత్తాలు కట్టలేక పోవడం.. వెరసి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తెనాలి మండలం కొలకలూరులో బుధవారం జరిగింది. గ్రామీణ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, వసుంధర దంపతులు తమ కుమారుడు కిరణ్‌, కోడలు యామినితో కలిసి ఉంటున్నారు. శ్రీనివాసరావు ఆటో నడుపుతారు. కిరణ్‌ విజయవాడలోని ఓ దుకాణంలో సేల్స్‌మాన్‌గా పనిచేస్తున్నారు. సొంత వ్యాపారం కోసమంటూ కిరణ్‌ అప్పులు చేశారు. అందుకు తల్లి కూడా సహకరించారు. ఈ మొత్తం రూ.20 లక్షలు దాటింది. చేయాలనుకున్న వ్యాపారం పట్టాలెక్కక పోవడం, అప్పుల తాకిడి ఎక్కువ కావడంతో బుధవారం ఉదయం ఇంట్లో దీనిపై కుటుంబసభ్యుల నడుమ చర్చ జరిగింది. ఆ తర్వాత కుటుంబ పెద్ద శ్రీనివాసరావు గ్రామంలోని ఓ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లగా.. మిగిలిన ముగ్గురు గడ్డిమందు తాగారు. గమనించిన స్థానికులు వారిని తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని