logo

సంపూర్ణ కవి జాషువా

సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ముందుగా సాంస్కృతికంగా ఏకమవ్వాలని, అప్పుడే సామాజికంగా అభివృద్ధి సాధించడం సులభమవుతుందని సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య అన్నారు.

Published : 26 Sep 2022 06:01 IST

లక్ష్మీనరసయ్యను సన్మానిస్తున్న అంబటి రాంబాబు, శ్రీకృష్ణదేవరాయలు, డొక్కా మాణిక్యవరప్రసాద్‌, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తదితరులు

గుంటూరు సాంస్కృతికం, న్యూసటుడే: సమాజంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా ముందుగా సాంస్కృతికంగా ఏకమవ్వాలని, అప్పుడే సామాజికంగా అభివృద్ధి సాధించడం సులభమవుతుందని సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు జి.లక్ష్మీనరసయ్య అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మహాకవి జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో జాషువా పద్యానికి పట్టాభిషేకం, దళిత లిటరరీ ఫెస్టివల్‌ జరిగాయి. ఈ సందర్భంగా లక్ష్మీనరసయ్యకు జాషువా పురస్కారమిచ్చి సత్కరించారు. లక్ష్మీ నరసయ్య సన్మానానికి స్పందిస్తూ జాషువా కవిత్వం కేవలం దళితపరమైనది మాత్రమే కాదని, ఆయన సమాజంలోని అన్ని అంశాలపైనా కవిత్వం రాయడంతో సంపూర్ణకవిగా ఖ్యాతి గడించారన్నారు. తనది అంబేడ్కర్‌, ఫులె సిద్ధాంత బాట అని, అయితే తమకు ఆది గురువు గుర్రం జాషువా అని లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. కార్యక్రమానికి పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ అధ్యక్షత వహించి మాట్లాడుతూ దళితుల క్షేమం కోసం కవిత్వమనే ఆయుధంతో పోరాడిన మహాకవి జాషువా అన్నారు.  

భారీ ఊరేగింపు...కార్యక్రమానికి ముందు జాషువా పురస్కార గ్రహీత లక్ష్మీనరసయ్యను నగరంపాలెం కూడలిలోని జాషువా విగ్రహం దగ్గర నుంచి విజ్ఞాన మందిరం వరకు కనక తప్పెటలు, కళారూపాలు, దళిత కవుల హర్షధ్వానాల మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ జంగా కృష్ణమూర్తి, మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం, కవి కోయి కోటేశ్వరరావు, పులికొండ సుబ్బాచారి, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, అత్తోట జోసఫ్‌, కేసన శంకరరావు, కట్టె పోగు ఉదయభాస్కర్‌, కొరివి వినయ్‌కుమార్‌, తాళ్లూరి లాబాను బాబు, గడ్డం ఎలీషా, ఎంజెఎస్‌ఎస్‌ఎస్‌ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని