logo

‘వైకాపా నేతలు విద్వేషాలు సృష్టిస్తున్నారు‘

వైకాపా నాయకులు మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాపాదయాత్రకు వెళుతున్న తుళ్లూరుకు చెందిన అమరావతి ఐకాస నాయకుడు గద్దె బుచ్చి తిరుపతిరావు

Published : 26 Sep 2022 06:01 IST

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా నాయకులు మూడు రాజధానులంటూ ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాపాదయాత్రకు వెళుతున్న తుళ్లూరుకు చెందిన అమరావతి ఐకాస నాయకుడు గద్దె బుచ్చి తిరుపతిరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి ఒక ప్రాంతానికి, ఒక సామాజిక వర్గానికి చెందినదిగా చిత్రీకరిస్తూ వైకాపా నాయకులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని కాపాడుకోవటానికి కులమతాలు, ప్రాంతాలకతీతంగా అమరావతికి ఆంధ్రులంతా ఒక్కటై మద్దతు తెలుపాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు 1013వ రోజుకు చేరాయి. అమరావతి ఐకాస ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహాపాదయాత్ర 2.0లో పాల్గొనటానికి ఆదివారం రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు పెద్దసంఖ్యలో కృష్ణా జిల్లాకి తరలి వెళ్లారు. వెంకటపాలెం, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, దొండపాడు, తుళ్లూరు, నీరుకొండ, తాడికొండ తదితర గ్రామాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని