logo

2024 నాటికి ఇంటింటికీ తాగునీటి కుళాయిలు

2024 నాటికి ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయిలు ఇవ్వాలనే లక్ష్యంతో జల్‌ జీవన్‌ మిషన్‌ పని చేస్తోందని ఆ సంస్థ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ మణీందర్‌, సీనియర్‌ ఎనలిస్ట్‌ షేక్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో

Published : 26 Sep 2022 06:01 IST

లింగంగుంట్ల రచ్చబండ వద్ద గ్రామపటాన్ని  పరిశీలిస్తున్న జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రతినిధులు షేక్‌ అహ్మద్‌, మణీందర్‌

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : 2024 నాటికి ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయిలు ఇవ్వాలనే లక్ష్యంతో జల్‌ జీవన్‌ మిషన్‌ పని చేస్తోందని ఆ సంస్థ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ మణీందర్‌, సీనియర్‌ ఎనలిస్ట్‌ షేక్‌ అహ్మద్‌ పేర్కొన్నారు. చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో జల్‌ జీవన్‌ మిషన్‌ ముగింపు అవగాహన కార్యక్రమంలో ఆదివారం వారు పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని తాతపూడి, మురికిపూడి, బొప్పూడి, రాజాపేట, వేలూరు, కుక్కపల్లివారిపాలెం, గోవిందపురం, లింగంగుంట్ల, కొండవీడు, మర్రిపాలెం, మైదవోలు, తుర్లపాడు, సందెపూడి, కారుచోల, వంకాయలపాడు, చిరుమామిళ్లలో ఐదు రోజులు పర్యటించి తాగునీటి లభ్యత, పంపిణీ, శుద్ధత వంటి పలు అంశాలను పరిశీలించినట్లు తెలిపారు. గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఇంటికీ శుద్ధ జలం అందించాలన్న సంకల్పంతో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. శుద్ధి చేసిన జలాన్ని మాత్రమే వాడి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమాలకు ఇంప్లిమెంటేషన్‌ సపోర్ట్‌ ఏజెన్సీగా పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (పోర్డ్‌) స్వచ్ఛంద సేవాసంస్థ పని చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో చిలకలూరిపేట గ్రామీణ నీటి సరఫరా విభాగం డీఈఈ అనిల్‌కుమార్‌, మూడు మండలాల ఏఈలు శ్రీనివాసరావు, సూర్యతేజ, పోర్డ్‌ స్వచ్ఛంద సేవాసంస్థ ప్రతినిధులు రాజ్‌కుమార్‌, నళిని, సర్పంచి  హమిదాబి, మాజీ సర్పంచి పెడవల్లి రాజ్‌కుమార్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని