logo

దసరా సంరంభానికి సన్నద్ధం

దేవీశరన్నవరాత్రి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. కుంకుమార్చన, నవావరణ పూజ, గోపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి అమ్మవార్లకు విశేష అలంకరణలు చేయనున్నారు. నరసరావుపేట కేంద్రంగా

Published : 26 Sep 2022 06:11 IST

నరసరావుపేటలో వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద విద్యుద్దీపాలతో అలంకరణ

నరసరావుపేట అర్బన్‌, న్యూస్‌టుడే: దేవీశరన్నవరాత్రి వేడుకలకు జిల్లాలోని ఆలయాలు ముస్తాబయ్యాయి. కుంకుమార్చన, నవావరణ పూజ, గోపూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి అమ్మవార్లకు విశేష అలంకరణలు చేయనున్నారు. నరసరావుపేట కేంద్రంగా జిల్లా ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి విజయ దశమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ప్రాచీన ఆలయాలు శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో 127వ ఏడాది, పాతూరులోని భీమలింగేశ్వరస్వామి ఆలయంలో 90వ ఏడాది, జగద్గురువు శ్రీభారతీతీర్థమహాస్వామి ప్రతిష్ఠించిన శంకరమఠంలోని శారదాంబకు 34వ ఏడాది, పాతూరులోని చౌడేశ్వరి ఆలయంలో 32వ సంవత్సరం వేడుకలు నిర్వహించనున్నారు.

వినుకొండ : విఠంరాజుపల్లి సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాట్లు


తొమ్మిది రోజులు.. తొమ్మిది విగ్రహాలు

వినుకొండ రూరల్‌, న్యూస్‌టుడే : మండలంలోని విఠంరాజుపల్లి సాయిబాబా ఆలయం వద్ద శాంతి ఆశ్రమం ట్రస్ట్‌, హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల వేడుకలను రూ.80 లక్షలకు పైగా ఖర్చుతో 26 నుంచి అక్టోబరు 5 వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 9 రోజుల పాటు 9 విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాల తయారీదారులు గ్రామానికే వచ్చి వాటిని పూర్తి చేశారు.  పూజా కార్యక్రమాలు, హోమాలు తిలకించేందుకు తొమ్మిది మండపాలు నిర్మించి తొమ్మిది అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు చండీ హోమం, అన్న సంతర్పణ చేయనున్నారు.

క్రేన్‌తో విగ్రహాలు తరలిస్తున్న వారికి సూచనలు చేస్తున్న హిమాలయ గురూజీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని