logo

ఆన్‌లైన్‌ కొనుగోళ్లతో జాగ్రత్త

ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా లేకుంటే వారి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని సైబర్‌ నేరస్థులు ఆర్థిక మోసాలకు పాల్పడతారని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు.

Published : 26 Sep 2022 06:11 IST

బాపట్ల, న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసే సమయంలో ప్రజలు జాగ్రత్తగా లేకుంటే వారి బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకుని సైబర్‌ నేరస్థులు ఆర్థిక మోసాలకు పాల్పడతారని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హెచ్చరించారు. ఎస్పీ ఆదివారం మాట్లాడుతూ ఎప్పుడూ సురక్షిత వెబ్‌సైట్లలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయాలని చెప్పారు. సైబర్‌ నేరస్థులు రూపొందించిన నకిలీ వెబ్‌సైట్లలో కొనుగోళ్లు చేయరాదన్నారు. గృహోపకరణాలు, వస్తువులపై భారీ రాయితీలు ప్రకటించగానే ఆశపడి మోసగాళ్ల వలలో చిక్కుకోవద్దన్నారు. నకిలీ వెబ్‌సైట్ల ద్వారా ప్రజల వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల సమాచారం తెలుసుకుని సైబర్‌ నేరాలకు పాల్పడతారని హెచ్చరించారు. ఫిషింగ్‌ ఈమెయిల్స్‌, లింకులను క్లిక్‌ చేయించటం ద్వారా ప్రజల క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు తెలుసుకుని బ్యాంకు ఖాతాలోని నగదు మోసపూరితంగా బదిలీ చేస్తారని వివరించారు. తప్పుడు కస్టమర్‌ కేర్‌ కేంద్రాల నుంచి ఫోన్‌ కాల్స్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ మోసం జరిగితే వెంటనే హెల్ప్‌లైన్‌ నంబరు 1930కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని