logo

రోడ్లా.. చెరువులా..?

జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. ఎటుచూసినా రహదారులు చెరువులను తలపించాయి. పెదకాకాని, పొన్నూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం

Published : 29 Sep 2022 04:40 IST

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లా వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గుంటూరు నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. ఎటుచూసినా రహదారులు చెరువులను తలపించాయి. పెదకాకాని, పొన్నూరు, తాడికొండ, మేడికొండూరు, ఫిరంగిపురం, కొల్లిపర తదితర మండలాల్లో వర్షం కురిసింది.

సగటున 2.9 మి.మీ వర్షపాతం

గుంటూరు జిల్లాలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు సగటున 2.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళగిరి 14, పెదకాకాని 11.2, వట్టిచెరుకూరు 9.6, తాడికొండ 4, ప్రత్తిపాడు 3.2, తుళ్ళూరు 2.8, దుగ్గిరాల 2.6, గుంటూరు తూర్పు 2, కాకుమాను 1, గుంటూరు పశ్చిమ 0.8, పొన్నూరు 0.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని