logo

తెదేపాకు కంచుకోట చీరాల

చీరాల మొదటి నుంచి తెదేపాకు కంచుకోట.. నాయకులు ఎందరు బయటకువెళ్లిన బలమైన క్యాడర్‌, ఓటుబ్యాంకు అక్కడ ఉంది. ప్రస్తుతం కొండయ్య నాయకత్వంలో పార్టీ బలమైన శక్తిగా తయారవుతోంది. వదంతులు నమ్మవద్ధు. రాబోయే

Published : 29 Sep 2022 04:40 IST

కొండయ్య నాయకత్వంలో పురోగతి

క్షీరపురి నాయకులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు

సమీక్ష నిర్వహిస్తున్న చంద్రబాబు

చీరాల, న్యూస్‌టుడే: చీరాల మొదటి నుంచి తెదేపాకు కంచుకోట.. నాయకులు ఎందరు బయటకువెళ్లిన బలమైన క్యాడర్‌, ఓటుబ్యాంకు అక్కడ ఉంది. ప్రస్తుతం కొండయ్య నాయకత్వంలో పార్టీ బలమైన శక్తిగా తయారవుతోంది. వదంతులు నమ్మవద్ధు. రాబోయే రోజుల్లో మరింతగా కష్టపడండి.. అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చీరాల పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. వివిధ నియోజకవర్గాలకు నిర్వహిస్తున్న సమీక్షలో భాగంగా బుధవారం మధ్యాహ్నం 3నుంచి 5గంటల వరకు చంద్రబాబు నివాసంలో చీరాల ముఖ్య నాయకులతో సమీక్ష జరిపారు. ఈసందర్భంగా బాబు మాట్లాడుతూ గతంలో ముగ్గురు నాయకులను బాగా ప్రోత్సహించామని.. అన్ని విధాలా సాయం అందజేశామని, వారు పార్టీ మారి ఇపుడు మనపైనే చెడుగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు కొండయ్యను పంపామని, ఆయన నాయకత్వంలో పార్టీ శ్రేణులు బలపడుతున్నాయని, ఇదే విధంగా ముందుకెళ్లాలని సూచించారు. రాజకీయ ప్రత్యర్థులు చేసే ప్రచారాలను నమ్మవద్దని చెప్పారు. అన్ని ప్రాంతాల్లో కమిటీలు ఏర్పాటు చేయటంతోపాటు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని, వారి సమస్యలపై పోరాడాలని సూచించారు. ఈసందర్భంగా ఇటీవల కాలంలో చీరాలలో చేపట్టిన కార్యక్రమాలను నాయకులు అధినేతకు వివరించగా వాటి సమాచారం తన వద్ద ఉందని, బాగా చేస్తున్నారని ప్రోత్సహించారు. చీరాల నాయకులకు తాను ఎపుడు అండగా ఉంటానని చెప్పారు. అనంతరం కొద్దిసేపు నియోజకవర్గ బాధ్యులు ఎంఎం కొండయ్యతో ఏకాంతంగా మాట్లాడారు. పలు కీలకమైన సూచనలు చేసినట్లు సమాచారం. మరింత దూకుడుగా వెళ్లాలని సూచించినట్లు తెలిసింది. డేటా నాగేశ్వరరావు, కౌతరపు జనార్దన్‌, పురుషోత్తం, పార్థసారథి, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఈక్రమంలో రాత్రి చీరాల పట్టణంలో కొండయ్య అభిమానులు, తెదేపా నేతలు కార్యకర్తలు బాణసంచా కాల్చి సందడి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని