logo

గుంటూరు వెళ్తేనే గుండెకు చికిత్స

జిల్లాలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె సంబంధిత సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో లేవు. నరసరావుపేట, సత్తెనపల్లిలో ప్రాంతీయ వైద్యశాలలు ఉన్నాయి. చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, అమరావతి, పెదకూరపాడు, ఈపూరు,

Published : 29 Sep 2022 04:40 IST

జిల్లాలో అందుబాటులో లేని వైద్యసేవలు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే

జిల్లాలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుండె సంబంధిత సమస్యలకు వైద్య సేవలు అందుబాటులో లేవు. నరసరావుపేట, సత్తెనపల్లిలో ప్రాంతీయ వైద్యశాలలు ఉన్నాయి. చిలకలూరిపేట, వినుకొండ, మాచర్ల, అమరావతి, పెదకూరపాడు, ఈపూరు, వీపీసౌత్‌, గురజాల సామాజిక వైద్యశాలలుగా సేవలందిస్తున్నాయి. వీటిలో వివిధ రకాల వ్యాధులకు చికిత్స అందించేందుకు వైద్య నిపుణులు అందుబాటులో ఉన్నా కార్డియాలజిస్టు ఒక్కరూ లేరు. జిల్లాలోని 28 మండలాల పరిధిలో 39 పీహెచ్‌సీలు ఉన్నా గుండె వైద్య నిపుణులు లేరు. ప్రైవేట్‌లోనూ అతి తక్కువ మంది కార్డియాలజిస్టులు ఉన్నారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో గుండె వైద్య సేవలు స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఏ చిన్న సమస్య ఉన్నా గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. గురువారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

గుండె సంబంధిత సమస్యలపై అవగాహన లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సుమారు 1.5 శాతం నుంచి రెండు శాతం మంది శిశువులు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడే గుండెకు రంద్రాలతో వస్తున్నారు. వారిలో ఎక్కువ మందికి వెంటనే శస్త్రచికిత్స అవసరం కాగా అవగాహనలేమి, ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

నీతిఆయోగ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి క్యాథల్యాబ్‌ను గుంటూరు సర్వజనాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ విభాగం 24 గంటల పాటు సేవలందిస్తుంది. జీజీహెచ్‌లో గుండె సంబంధిత వైద్య సేవలు ఎంతో మెరుగయ్యాయి. వైద్య నిపుణులు ఈసీజీ, 2డీ ఎకో, ట్రెడ్‌మిల్‌ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి శస్త్రచికిత్సలకు ఇన్‌ పేషెంట్‌లుగా చేర్చుకుంటున్నారు. వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి సిఫార్సుల మేరకు రోగులకు మెరుగైన సేవలందిస్తున్నారు. ఏటా సుమారు 50 వేల మంది గుంటూరు సర్వజనాసుపత్రిలో గుండె సంబంధిత సమస్యలకు వైద్యం చేయించుకుంటున్నారు.

ఏపీవీపీ ఆసుపత్రుల్లో గుండె సంబంధిత వైద్య సేవలకు కార్డియాలజిస్టులు ప్రస్తుతం అందుబాటులో లేరని.. భవిష్యత్తులో వారి సేవలు ప్రజలకు చేరువ చేస్తామని ఆ ఆసుపత్రుల పల్నాడు జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బీవీ రంగారావు తెలిపారు. జనరల్‌ ఫిజీషియన్లు గుండె సమస్యలున్న వారిని గుర్తించి గుంటూరు సర్వజనాసుపత్రికి సిఫార్సు చేస్తున్నట్లు చెప్పారు.

Read latest Guntur News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని