logo

వీసీ బాధ్యతల స్వీకారం

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉప కులపతిగా ఆచార్య రాజశేఖర్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఏఎన్‌యూ ప్రధాన ద్వారం వద్ద ఉన్న నాగార్జునుడి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం

Updated : 29 Sep 2022 06:36 IST

ఉప కులపతిగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య రాజశేఖర్‌

ఏఎన్‌యూ, న్యూస్‌టుడే: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఉప కులపతిగా ఆచార్య రాజశేఖర్‌ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఏఎన్‌యూ ప్రధాన ద్వారం వద్ద ఉన్న నాగార్జునుడి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఉన్న గాంధీజీ, అంబేడ్కర్‌, ఫులే, బాబూ జగ్జీవన్‌రామ్‌, కలాం, వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెక్టార్‌ ఆచార్య వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కరుణ, ఇతర అధికారులు, అతిథి అధ్యాపకులు, ఉద్యోగుల సంఘం నాయకులు, అనుబంధ కళాశాలల ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు.

డైనింగ్‌ హాల్‌ ప్రారంభం: మహిళల వసతిగృహంలో నూతనంగా నిర్మించిన రెండో డైనింగ్‌ హాల్‌ను వీసీ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో మహిళా అధ్యాపకులు ప్రారంభించారు. అనంతరం వసతిగృహ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఏయే వసతిగృహాల్లో విద్యార్థుల బాకీలు ఎక్కువగా ఉన్నాయో వివరాలడిగి తెలుసుకున్నారు. బకాయిలున్న విద్యార్థుల మార్కులను ఆపాలని ఈ సందర్భంగా వీసీీ చెప్పినట్టు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని