logo

అబ్బురపరచిన జాగిలాల విన్యాసాలు

కరుడుగట్టిన తీవ్రవాదులు ఒక్కసారిగా ప్రజాప్రతినిధిపై దాడి చేశారు. భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయినా ఘటనా స్థలానికి చేరే పరిస్థితి లేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన రక్షణ సిబ్బంది జాగిలాలను రంగంలోకి దించారు.

Published : 29 Sep 2022 04:40 IST

హోంమంత్రికి పుష్కగుచ్ఛం అందిస్తున్న జాగిలం

మంగళగిరి(తాడేపల్లి), న్యూస్‌టుడే: కరుడుగట్టిన తీవ్రవాదులు ఒక్కసారిగా ప్రజాప్రతినిధిపై దాడి చేశారు. భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయినా ఘటనా స్థలానికి చేరే పరిస్థితి లేదు. వ్యూహాత్మకంగా వ్యవహరించిన రక్షణ సిబ్బంది జాగిలాలను రంగంలోకి దించారు. ఒక్కసారిగా అవి తీవ్రవాదులపై దాడి చేయగానే రక్షణ సిబ్బంది ఘటన ప్రదేశానికి చేరుకొని ప్రజాప్రతినిధిని సురక్షితంగా అక్కడ నుంచి తీసుకువెళ్లిపోయారు. తీవ్రవాదులను రక్షణ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్‌లో 20వ బ్యాచ్‌కి చెందిన డాగ్‌ స్క్వాడ్‌ (కెనైన్‌) పాసింగ్‌ అవుట్‌ పరెడ్‌లో నిర్వహించిన నమూనా ప్రదర్శన. పోలీసు శాఖకు జాగిలాలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో చూపేందుకు ఆ శాఖ నిర్వహించిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. నేర పరిశోధనతో పాటు నేరస్థులను పట్టుకోవడంలో ఎలా ఉపయోగపడుతున్నాయో దాదాపుగా పది రకాల ఈవెంట్లను ప్రదర్శించారు. హోం మంత్రి తానేటి వనిత, హోంశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ హరీష్‌కుమార్‌గుప్తా, ఇంటెలిజెన్స్‌ డీజీపీ సీతారామాంజనేయులు, గుంటూరు రేంజ్‌ ఐజీ త్రివిక్రమవర్మ, ఎస్పీ ఆరీఫ్‌హఫీజ్‌, గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

20 బ్యాచ్‌ కెనైన్స్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ మార్చ్‌ఫాస్ట్‌

 వాసన పసిగడుతున్న జాగిలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని