logo

‘అంబటీ నోరు అదుపులో పెట్టుకో’

రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన తమపై వైకాపా నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బుధవారం తుళ్లూరు శిబిరంలో నిరసనల్లో పాల్గొన్న రైతు జొన్నకూటి ఏడుకొండలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 29 Sep 2022 04:40 IST

వెంకటపాలెంలో కొవ్వొత్తులు పట్టుకొని నినాదాలు చేస్తున్న మహిళలు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన తమపై వైకాపా నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బుధవారం తుళ్లూరు శిబిరంలో నిరసనల్లో పాల్గొన్న రైతు జొన్నకూటి ఏడుకొండలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ అమరావతి నుంచి అరసవల్లి వరకు అమరావతి రైతులు ఒళ్లు బలిసి పాదయాత్ర చేస్తున్నారని వ్యాఖ్యలు చేసిన మంత్రి అంబటి రాంబాబు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. తీరు మార్చుకోక పోతే ఆయన రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. పనులు చేపట్టకుండా అమరావతిని అడవిలా మార్చుతున్నారని మండిపడ్డారు. రాజధాన్ని శ్మశానం అన్న వైకాపా నాయకులు ఇక్కడి ఎందుకు వస్తున్నారు, అసైన్డ్‌ రైతులకు కౌలు రాలేదని ఒక్కరైనా అసెంబ్లీలో అడిగారా అంటూ నిలదీశారు. మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాజధాని గ్రామాల్లో చేస్తున్న నిరసనలు 1016వ రోజుకు చేరాయి. బుధవారం రాత్రి వెంకటపాలెం శిబిరం వద్ద మహిళలు కొవ్వొత్తులు పట్టుకొని నిరసన తెలిపారు. మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయపాలెం, నీరుకొండ, తాడికొండ తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని