Andhra News: వచ్చి చూస్తే తెలుస్తుంది.. మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై బొత్స కామెంట్‌

ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు పెట్టి లోపల వేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన

Published : 30 Sep 2022 01:09 IST

అమరావతి: ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు పెట్టి లోపల వేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ‘‘హరీశ్‌రావు మా ప్రభుత్వంపై మాట్లాడి ఉండకపోవచ్చు. ఒక్కసారి వారు వచ్చి చూస్తే టీచర్లకు మేం చేసినవి తెలుస్తుంది. ఏపీలో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు. ఏపీ, తెలంగాణలో ఇచ్చిన పీఆర్‌సీలలో తేడా చూస్తే తెలుస్తుంది’’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.

విశాఖ రుషికొండలో పాత హోటల్‌ స్థానంలో కొత్త హోటల్‌ కడితే తప్పేంటని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రుషికొండలో నిర్మాణాలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయని,  ప్రభుత్వ కార్యాలయాలు, సీఎం కార్యాలయం నిర్మిస్తే తప్పేముందని వ్యాఖ్యానించారు. అవసరమైతే అఖిలపక్షాలను రుషికొండ తీసుకెళ్లి చూపిస్తామన్నారు. అమరావతి రైతుల ముసుగులో తెదేపా యాత్ర చేస్తోందని ఆరోపించారు. తెదేపా నేతలే నేరుగా యాత్ర చేయొచ్చు కాదా అని విమర్శించారు. అమరావతి రైతు యాత్రలో మాట్లాడుతున్న వ్యక్తి స్థిరాస్తి వ్యాపారి కాదా? అని ప్రశ్నించారు. ‘‘మేము విశాఖను దోచుకోవాలంటే ఎప్పుడో సగం మా జేబులో ఉండేది. దేవుడి దయ వల్ల మా తాతలు, తండ్రి ఇచ్చిన ఆస్తి ఉంది. ఇంటర్‌ చదివే రోజుల్లోనే అంబాసిడర్‌ కారులో తిరిగేవాడిని’’ అని బొత్స సత్యనారాయణ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని